యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరగా ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్..బీఆర్‌ఎస్ రాజకీయం కోసం కాదు.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నామని, భగవంతుడి దయ, తెలంగాణ ప్రజల అదృష్టంతో చాలాగొప్పగా రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని, గతంలో ఎంతో మంది సీఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారన్నారు.
24 గంటల విద్యుత్ ఇవ్వడానికి అధికారులతో మాట్లాడానని, కరెంటును కొనాల్సి వస్తుందంటే ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో వడ్లు తీసుకుపోయి మార్కెట్లలో ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కళ్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.
Also Read:‘శ్రీలీల’ ను వేధిస్తున్న నిర్మాత ?
ఇవాళ రోడ్లకు ఇరువైపులా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, రైస్ మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయన్నారు. రూ.80వేలకోట్టు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పారు. ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని, ధరణి పోర్టల్‌లో భూములను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు.