బిగ్ బాస్ 4…రెండో ఎలిమినేషన్‌ ఎవరో తెలుసా!

156
kumar sai

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 14 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకుంది. ఈ వారం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇద్దరు సభ్యులు హౌస్‌లోకి రాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు నాగార్జున.

ఇక రెండో వారం నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిలో మొదట గంగవ్వ సేఫ్ కాగా మిగిలిన 8 మందిలో . రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, నోయల్, కరాటే కళ్యాణి, హారిక, అభిజిత్, మోనాల్, సొహైల్‌‌లలో కరాటే కళ్యాణి ఎలమినేట్ అయినట్టు తెలిపారు నాగార్జున.

దీంతో బిగ్ హౌస్‌ నుండి తట్టాబుట్టా సదిరేసింది కళ్యాణి. ఇక రెండో ఎలిమినేషన్ ఎవరా అనే సందేహం అందరిలో నెలకొనగా ఓటింగ్‌లో కరాటే కల్యాణి తర్వాత లీస్ట్‌లో ఉంది అమ్మా రాజశేఖర్,కుమార్ సాయి.

అయితే శనివారం జరిగిన హీరో- జీరో టాస్క్‌లో మెజార్టీ సభ్యులు అమ్మా రాజశేఖర్‌ని హీరోగా చేయగా కుమార్ సాయిని జీరో చేశారు. దీనికి తోడు హౌస్‌లో ఎవరితో కలవకుండా ఒక్కడే ఉంటుండటంతో సభ్యులందరూ అతడిని జీరో చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కుమార్ సాయి ఎలిమినేట్ కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరికొద్దిగంటల్లో బిగ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేదవరనే దానిపై స్పష్టత రానుంది.