ఓయూ వీసీగా ప్రొ.కుమార్ మొగ్లారామ్

6
- Advertisement -

తెలంగాణ‌లోని 9 యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్‌ను నియమించింది ప్రభుత్వం. వీసీల నియ‌మాకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ. ఉస్మానియా యూనివ‌ర్సిటీగా వీసీగా కుమార్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్ర‌తాప్ రెడ్డి, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్, తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా యాద‌గిరి రావు నియమితులయ్యారు.

పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా నిత్య‌నంద‌రావు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీగా అల్దాస్ జాన‌య్య‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం వీసీగా ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి నియామ‌కం అయ్యారు.

Also Read:Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

- Advertisement -