కూల్చడమే.. బీజేపీ ఏజెండా?

46
BJP
- Advertisement -

దేశంలో గత తొమ్మిదేళ్ల కాలంగా పాలన సాగిస్తున్న బీజేపీ.. అధికారం కోసం ఎంతటి అక్రమాలు చేయడానికైనా సిద్దంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకటే బీజేపీ నేతలు అనుసరిస్తునన్న వ్యూహాలు చూస్తే వారికి అధికార దాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాషాయ జెండా ఎగరాలని, మోడి నినాదమే వినిపించాలని చెబుతున్నా కమలనాథులు అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమే అనే సంకేతాలను ఇస్తున్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూడా కూల్చడానికి వెనుకాడడం లేదు. దీనికి మంచి ఉదాహరణ మహారాష్టలో జరిగిన పరిణామలే. ఏక్ నాథ్ షిండే ద్వారా థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అక్రమంగా అధికారంలోకి వచ్చిన సంగతి యావత్ దేశ ప్రజానీకానికి తెలుసు. .

ఇక అప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలోనూ ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారనే.. ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయిలో కుని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చుతామని ఏకంగా అమిత్ షా నే ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవల బీర్ భూమ్ లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. 2025 లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అవసరమే ఉండదని, మమతా బెనర్జీకి చోటు లేకుండా ఆమె ప్రభుత్వాన్ని కులదోయటం పక్కా అనే రీతిలో వ్యాఖ్యానించారు అమిత్ షా.

ప్రస్తుతం అమిత్ షా చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రజా మద్దతుతో అధికారంలోకి రావాలేతప్పా.. అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూల్చడం కాదు అంటూ అమిత్ షా పై మండి పడుతున్నారు రాజకీయ అతివాదులు. అయితే తెలంగాణలో కూడా కే‌సి‌ఆర్ సర్కార్ ను కూల్చుతామని చెబుతున్నా బీజేపీకి ఎప్పటికప్పుడు గట్టి షాక్ ఇస్తున్నారు తెలంగాణ ప్రజలు. మరి మమతా బెనర్జీ విషయంలో కూడా ఇదే విధాగ్మా చెబుతున్నా కమలనాథులకు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఏపీలో సంకీర్ణ ప్రభుత్వామా ?

దేశానికి హైదరాబాద్‌ రెండో రాజధాని .. అంబేద్కర్ ఆశయం నెరవేరలేదు

CMKCR:అంబేద్కర్ పేరిట అవార్డులు : కేసీఆర్‌

- Advertisement -