జాదవ్‌ లేటెస్ట్ వీడియో..

183
Kulbhushan Yadav New Video Statement Released
- Advertisement -

ఇటీవలే కూల్‌భూషన్ జాదవ్‌కు.. తల్లి, భార్యను కలుసుకునే అవకాశం కల్పించిన పాకిస్థాన్‌, తాజాగా జాదవ్‌ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. డిసెంబర్ 25వ తేదీన ఇస్లామాబాద్‌లో జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. అప్పుడు ఫోటోలను రిలీజ్ చేసిన పాక్ విదేశాంగ శాఖ, ఇవాళ దానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తన కుటుంబాన్ని కలుసుకునేందుకు వీలు కల్పించడం పట్ల జాదవ్ పాక్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాకుండా తనను కలుసుకోవడం వల్ల తన భార్య, తల్లి సంతోషంగా ఫీలయ్యారని, తన ఆరోగ్యం పట్ల తన తల్లి సంతోషం వ్యక్తం చేసిందని, తనకు ఎటువంటి హాని జరగదని జాదవ్ ఆ వీడియోలో అన్నట్లుగా ఉంది. అయితే జాదవ్ కుటుంబాన్ని పాక్ అవమానించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పాక్ ఈ వీడియోను రిలీజ్ చేయడం సందేహాంగా మారింది. జాదవ్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన అభియోగాలు ఎదుర్కొందున్న పాక్…దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జాదవ్ వీడియోను ప్లే చేశారు.

కాగా పాక్ విదేశాంగ అధికారుల జాదవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి వీడియోలో ఈ తరహాలో మాట్లాడించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియోపై జాదవ్ కుటుంబం ఇంకా ఏమీ మాట్లాడలేదు.

- Advertisement -