మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత చురుగా ఉంటారో తెలిసిందే. తాజాగా ట్విటర్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులపై ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునరుద్ధరించబడింది. ఈ ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఆలయ పునర్నిర్మాణం మొత్తం రాతితోనే జరిగింది. ఇందుకు రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించినట్లు తెలిపారు.
యాదాద్రి ఆలయం మొత్తం గ్రానైట్‌తో కట్టిన కట్టడంగా దేశంలో అతి పెద్ద టెంపుల్‌గా నిలిచిపోతుందన్నారు. భారత్‌కు ఇది ఒక గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ట్వీట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం.. ప్రాచీన కట్టడం మాదిరి ఆలయ పునర్నిర్మాణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే 2000 సంవత్సరాల వరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. త్వరలోనే కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది కేటీఆర్ తెలిపారు.
Renovated #Yadadri Lakshmi Narsimhaswamy Temple; yet another great initiative of Hon’ble CM #KCR Garu 🙏#Telangana pic.twitter.com/TqI4h3o3gS
— KTR (@KTRTRS) December 9, 2019