మేయర్ విజయలక్ష్మికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు..

25
ktr

నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 11న జరిగిన మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిద్దరు 22న ఉదయం 9:30 గంటలకు తమ కార్యాలయాల్లో పూజల అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు.

మేయర్‌కు మంత్రి అభినందనలు..జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆదివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వారి నివాసా ల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మేయర్‌ను అభినందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు.