సింగరేణిలో రెండోసారి టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. టీబీజీకేఎస్ గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్….ఎంపీ కవితకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కనపెట్టి కూటమి కట్టినా టీబీజీకేఎస్ గెలుపును అపలేకపోయారని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలుపుకోసం కవిత విశేష కృషిచేసిందని కొనియాడారు మంత్రి కేటీఆర్.
Immoral alliance of opposition parties sans any ideology couldn't stop TBGKS from sweeping Singareni. Many congrats @RaoKavitha great job👍🎉
— KTR (@KTRTRS) October 6, 2017
టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.