అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్…కేటీఆర్ హర్షం

200
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హిల్లరీ సహా భారత ప్రధాని నరేంద్రమోడీ తదితరులు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌,ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.

కొన్ని గంటలుగా ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు ఆసక్తి ఎదురుచూసిందని ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. ట్రంఫ్ థండర్.. ఇండియాలో మోదీ సంచలన నిర్ణయం.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. మున్ముందు కూడా ఇలాంటి స్వీట్ షాక్ లు తప్పక చవిచూడాల్సిఉంటుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.

ktr

మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మే చివరి వారంలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. మే 25-25 తేదీల్లో ఇండియానా గవర్నర్ మైక్ పేన్స్ ను కలుసుకున్నారు(అప్పటికే పేన్స్ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు) ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే ’సిస్టర్ సిటీస్ కమ్యూనిటీ’లో భాగంగా కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.

నాటి సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ బుధవారం తన ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం పెన్స్‌..అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో కేటీఆర్‌ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తూ..ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.మైక్ పెన్స్ విజయంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజు చింతల తనవంతు పాత్ర పోషించారు. పెన్స్ తో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రాజు చింతల…ఈ ఏడాది మేలో కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం కావటంలో తన తోడ్పాటును అందించారు.

ktr

ఇదిఇలా ఉండగా అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ జనవరి 20న యూఎస్‌ కాపిటోల్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పదవీ కాలం ముగియనుంది. తొలుత అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. బుధవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ 270కి పైగా స్థానాలను కైవసం చేసుకొని విజేతగా నిలిచారు.

ktr

- Advertisement -