KTR:BRSలోకి పొన్నాల వస్తే…స్వాగతిస్తాం

28
- Advertisement -

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నా లక్ష్మయ్య బీఆర్ఎస్‌లోకి వస్తానంటే స్వాగతిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు పొన్నాల. ఆయన బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా స్పందించారు కేటీఆర్.

పొన్నాల వస్తానంటే స్వాగతిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సరితూగే నాయకుడు బీజేపీ, కాంగ్రెస్‌లో లేరని తెలిపిన కేటీఆర్…రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 స్ధానాల్లో అభ్యర్థులే లేరన్నారు. కర్ణాటక డబ్బులపైనే ఆ పార్టీ ఆధారపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. తెలంగాణ కంటే మంచి పాలన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అందిస్తున్నారో చెప్పాలన్నారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ, గుజారత్ అహంకారానికి మధ్య జరిగే పోరాటం అన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌ని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నారన్నారు. కొడంగల్‌లో ప్రజలకు పంచేందుకు ఇప్పటికే రూ. 8 కోట్లు చేరిపోయాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదన్నారు. ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కామనే అన్నారు.

Also Read:దేవర ఈ సోదేంది బాసూ?

- Advertisement -