ఓపెన్ ఏఐ సీఈవోకు కేటీఆర్ ఆహ్వానం

4
- Advertisement -

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్…ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు మాజీ మంత్రి కేటీఆర్.

ఇండియాలో కృత్రిమ మేధస్సు వాడ‌కం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గత సంవత్సరం నుంచి చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇండియాలో మ‌రింత పెట్టుబ‌డి పెట్టడానికి మేము మ‌రింత ఉత్సాహంగా ఉన్న‌ట్లు శామ్ రాసుకోచ్చాడు.

హైదరాబాద్ ఇండియాకు సరైన ప్రవేశ ద్వారంగా, మరియు ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు అనువైన కేంద్రంగా అభివర్ణించారు. ఇక్కడ టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మరియు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి సంస్థలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.

Also Read:బిగ్ బాస్ హౌస్‌లోకి టైసన్!

- Advertisement -