ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞపులుపై స్పందించడం, సాయం చేయడం ఇలా విషయం ఏదైన తనకి నచ్చే దానిపై ట్వీట్టర్ ద్వారా ప్రశంసలు కురిపిస్తుంటాడు.
తాజాగా ఆదివారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం చూశారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. పవన్ నిజంగా విజేతనే అని ప్రశంసించారు కేటీఆర్. చేనేతకు పవన్ ప్రోత్సాహం అభినందనీయమన్నారు. చేనేత రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించాలని పవన్‌ను, చిత్ర నిర్మాత శరత్ మరార్‌ను కేటీఆర్ కోరారు.
ఒక కాటమరాయుడు షూటింగ్ లో పవన్ కల్యాణ్ .. మగ్గంపై దుస్తుల తయారీని పరిశీలించే సీన్ ఉంది. ఇటీవల మెదక్ జిల్లాలో సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సమయంలో నేతన్నల దగ్గరకి వెళ్లి మరీ.. ఎలా నేస్తారు.. ఎంత సమయం పడుతుంది.. ఎంత ఖర్చు అవుతుంది.. ఎంత ధరకు అమ్ముతున్నారు.. గిట్టుబాటు అవుతుందా లేదా.. ప్రభుత్వ సాయం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఇక తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత వివిధ ప్రాంతాల్లో పర్యటించి నేతన్నల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసేందుకు తనవంతు కృషి చేస్తున్న సమంతపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.