సాహో సూపర్బ్‌…: కేటీఆర్

632
ktr

సాంకేతికపరంగా సాహో అద్భుతమైన సినిమా అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఇవాళ తాను రెండు అద్భుతమైన తెలుగు సినిమాలు చూశాను..అందులో ఒకటి సాహో..సాంకేతంగా అద్భుతమైన చిత్రం అన్నారు.

ప్రభాస్,సుజిత్‌కు అభినందనలు..భారత చలనచిత్ర పరిశ్రమలోని ఫిల్మ్ మేకర్స్ స్ధాయిని పెంచిందన్నారు. ఎవరు సినిమా బాగుంది…అడవి శేషు,రెజీనా,నవీన్ అద్భుతంగా నటించారని తెలిపారు కేటీఆర్.

దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 205 కోట్లు రాబట్టిందని నిర్మాతలు వెల్లడించారు.