కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్

5
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములకు సంబంధించిన భూ కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. HILTP పేరుతో సుమారు రూ.5 లక్షల కోట్ల భూ మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి, ఈ అక్రమాలను బహిర్గతం చేయడానికి కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పర్యటనలో భాగంగా కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ ప్రాంతంలో హమాలీలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న భూ అక్రమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా పరిశ్రమలకు చెందిన భూములను కూడా లాభాల కోసం వాడుకుంటోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, అలాగే స్థానిక నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

Also Read:పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ హ్యాక్!

- Advertisement -