హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం: కేటీఆర్

2
- Advertisement -

గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం విషయంలో బాధిత కుటుంబసభ్యులు ఎవర్నీ నిందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్‌ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ప్రమాదానికి గురైన ప్రాంతంలో పర్యటించారు కేటీఆర్. బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. మౌలిక వసతుల కల్పనపై పెడితే బాగుంటుందని సూచించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్కులు, ఫైరింజన్‌లో నీళ్లు ఉంటే గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం తప్పదేని అన్నారు. 125 సంవత్సరాల నుంచి చార్మినార్‌ దగ్గర ఉంటున్న అగర్వాల్‌ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకరమని అన్నారు.

ఫైరింజన్‌, అంబులెన్స్‌లో కనీస సదుపాయాలు ఉంటే కొన్ని ప్రాణాలు అయితే బతికేవని బాధిత కుటుంబసభ్యులు అంటున్నారు. తమకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని వారు కోరుకుంటున్నారని తెలిపారు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలని.. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కానీ ఇవేవి జరగలేదని.. ఇది మంచిది కాదని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

Also Read:త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్?

- Advertisement -