తెలంగాణ ప్రభుత్వ నీటి యాజమాన్య, సరఫరా, సంరక్షణ విధానాలకు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు లభించాయి. ఇవాళ అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఎన్విరాన్ మెంటల్ వాటర్ రిసోర్సు కాంగ్రెస్ ( ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సు) సమావేశంలో మంత్రి కెటి రామారావు కీలకోపన్యాసం చేశారు. నీటి యాజమాన్య, సరఫరా, సంరక్షణ అంశాలకు తెలంగాణ ప్రజల జీవితాలతో వీడదీయలేని అనుబంధం ఉందని తెలిపిన మంత్రి, తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండగను వివరిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని, ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టలేదన్నారు. ప్రజలందరికీ సరిపడేంతగా రక్షిత మంచినీరు అందిచాలని, ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన సస్టేయినబుల్ డెవలనప్ మెంట్ గోల్ నంబర్ 6కు అనుగుణంగా ఈ పథకం ఉందన్నారు. నీటితో పాటు ఇంటీంటికి ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా ప్రతి ఓక్కరికి ప్రపంచంతో అనుసంధానం అయ్యే అవకాశం లభిస్తుందని, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషణ్ వంటి రంగాల్లో ఘననీయమైన మార్పు వస్తుందని తెలిపారు.
సాగునీటి సంరక్షణ పద్దతుల్లో ప్రపంచం అధ్యయనం చేయతగిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తాము చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల గొలుసు కట్టు చేరువులకు పునరుజ్జీవనం చేసేలా రూపొందించిన ఈ కార్యక్రమం ఈ సదస్సు నేపథ్యానికి చక్కగా సరిపోతుందన్నారు. ఈ మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పూడికతీత ద్వారా నీటి వనరుల సంసరక్షణతోపాటు భూగర్బజలాలు పెరుగుతాయని, ప్రస్తుతం బోర్లపై అధారపడి చేస్తున్న వ్యవసాయా రంగంలో సుస్థిరమైన సాగునీటి లభ్యత సాద్యం అవుతుందని తెలిపారు.
మంత్రి ఉపన్యాసంలో తెలిపిన తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రభత్వ దూరదృష్టికి సదస్సుకు హజరయిన మేధావులు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు అదర్శంగా ఉంటాయని తెలిపారు. మంత్రి ప్రసంగం, తెలంగాణ విధానాలు చాల ఆసక్తికరంగా ఉన్నాయని, సదస్సుకు చక్కటి ప్రారంభి లభించిందని వాటర్ కాంగ్రెస్ కాబోయే అధ్యక్షురాలు క్రీష్టీనా స్వాలో తెలిపారు.
సాన్ మినా సియివో తో మంత్రి భేటీ
ఈ రోజు మద్యాహ్నం సిలికాన్ వ్యాలీలోని సాన్ హోసే నగరంలో సాన్ మినో కార్యాలయంలో సంస్థ సియివో జ్యూర్ సోలా (Jure Sola)తో మంత్రి కెటి రామరావు భేటీ అయ్యారు. ఈ సమావేశం తెలంగాణలో ఏలక్ర్టానిక్స్ పరిశ్రమ నెలకొల్పేందుకున్న అనుకూలతలు వివరించారు. తెలంగాణ ఏలక్ట్రానిక్స్ పాలసీని మంత్రి వివరించారు. తెలంగాణకు సాన్ మినో ప్రతినిధి బృందాన్ని అహ్వనించారు.
తెలంగాణలో పెట్టుబడుల సాధనకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న మంత్రి కెటి రామారావు గౌరవార్ధం టై సిలికాన్ వ్యాలీ చాప్టర్ ఒక విందు ఎర్పాటు చేసింది. సిలికాన్ వ్యాలీలోని పలు ప్రముఖ కంపెనీల సియివోలు ఈ విందు సమావేశంలో పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలపైన సంభాషించారు. టై సిలికాన్ వ్యాలీ ప్రతినిధులు రాజు రెడ్డి, రాం రెడ్డిల, అడోబీ కంపెనీ సియివో శాంతను నారణాయన్, అరుబా నెట్ వర్క్ వ్యవస్థాపకులు కీర్తీ మెల్కోటే వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హజరయ్యారు.