దీక్షా దివస్ సందర్భంగా ఈ నెల 29న ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విద్యార్థి సంఘాల చైతన్యాన్ని పెంపొందించే దిశగా, తెలంగాణ ఉద్యమ స్పూర్తిని స్మరించుకునే ఉద్దేశంతో జరగనుంది. పోస్టర్ ఆవిష్కరణలో బిఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, అలాగే పలువురు బిఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ ఏర్పాటులో విద్యార్థులు పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు. విద్యార్థుల దీక్షలు, పోరాటాలు, త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. నేటి తరానికి ఆ స్పూర్తిని చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేవలం విద్యా కేంద్రం మాత్రమే కాదు, సమాజ మార్పుకు నాంది పలికిన ప్రేరణామూర్తి అని కేటీఆర్ గుర్తుచేశారు.
గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ…దీక్షా దివస్ కార్యక్రమం విద్యార్థుల సమస్యలు, రాష్ట్రంలో విద్య రంగ అభివృద్ధి, యువత భవిష్యత్తు మీద చర్చ జరిగే వేదికగా ఉంటుందని తెలిపారు. యువత భావజాలాన్ని, ఉద్యమ స్ఫూర్తిని మరోసారి వెలుగులోకి తెచ్చేందుకు, సంఘటిత శక్తితో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
Also Read:ప్రభాస్… ‘స్పిరిట్’ అప్‌డేట్

