కాంగ్రెస్ నేతలు గోబెల్స్ వారసులన్నారు మాజీ మంతరి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.సీఎం రేవంత్ రెడ్డి పాలన.. ఆహా నా పెళ్లాంట సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని ఎద్దెవా చేశారు.
ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. విద్యార్థి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చి డిక్లరేషన్ల పేరిట ఊదరగొట్టారు. ఇవి నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లను పట్టుకుని ఆఫిడవిట్లు తయారు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఒట్లు పెట్టి డ్రామాలు ఆడారు. గ్యారెంటీ కార్డులు పంచారు. జోసెఫ్ గోబెల్స్ వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఆహా నా పెళ్లాంట సినిమాలో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ పిసినారిగా ఉంటుంది. చికెన్ పెడుతా అని ఇంటికి కొందరిని పిలుస్తాడు. ఇక ప్లేట్‌లో అన్నం, చట్నీ వేసి.. ముందట కోడిని వేలాడదీస్తాడు.. ఇదే చికెన్ అని ఊరిస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు అలాగే ఉందన్నారు. ఆరునూరైనా సరే.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం, చేసి చూపెడుతా అని గంభీరమైన డైలాగులు కొట్టారు. ఇది చేస్తాం.. అది చేస్తాం.. పొడిచెస్తాం అని 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 14వ నెల నడుస్తుంది కానీ హామీల గురించి అడిగితే అక్రమ కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారన్నారు.
Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’