జమ్మూలో టెన్షన్ పరిస్థితి నెలకొనడం,కేంద్రం భద్రతా బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఉం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. శ్రీనగర్ నిట్‌లో చదువుకుంటున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను జిల్లా యంత్రాంగం బలవంతంగా పంపించివేస్తోంది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా సందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీనగర్ నిట్ క్యాంపస్ ను తక్షణం ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అక్కడి తెలుగు విద్యార్థులు నాకు సందేశాలు పంపుతున్నారు. మీరంతా జాగ్రత్తగా రాష్ట్రానికి తిరిగివచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏదైనా సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి గారిని పోన్ నంబర్ 011-2338 2041 లేదా 91 99682 99337 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.