తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాతో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా వెంటనే స్పందిస్తూ ఉంటారు మంత్రి కేటీఆర్. అప్పుడప్పుడు ఇతర విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. శనివారం రష్యాలో జరిగిన పీఫా వరల్డ్ కప్ తొలి నాకౌట్ పోటీలో జర్మనీతో తలపడిన అర్జెంటీనా ఓడిపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మ్యాచ్ లో తీవ్రంగా శ్రమించిన 31 ఏళ్ల లిమోనెల్ మెస్సీ తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలం కావడంతో అతనికి దాదాపు ఇదే ఆఖరి ఫుట్ బాల్ ప్రపంచకప్ కావచ్చు.
కాగా, కేటీఆర్ ఓ ట్వీట్ చేస్తూ, “అందుకే ఈ ఆట ఎంతో ప్రత్యేకం. 90 నిమిషాలు, 7 గోల్స్ అండ్ 8 ఎల్లో కార్డ్స్!!! మరో ఫిఫా ప్రపంచకప్ క్లాసిక్” అని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనాపై 4-3 గోల్స్‌తో ఫ్రాన్స్ విజయం సాధించింది. యువ ఆటగాడు కిలియన్ ఎంబప్పే సంచలన ప్రదర్శనతో ఫ్రాన్స్‌కు రెండు గోల్స్ అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన కిలియన్ హీరోగా నిలిచాడు. రెండు గోల్స్ సాధించడం మాత్రమే కాదు ఆ జట్టుకు ఒక పెనాల్టీ వచ్చేలా వ్యూహాత్మకంగా ఆడాడు.