ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గండిపేట పార్క్‌ మంత్రి కేటీఆర్‌

81
gandipet
- Advertisement -

హైదరాబాద్‌కు దుర్గం చెరువు కెబుల్‌ బ్రిడ్జీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణ పర్యటక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు మంత్రి కేటీఆర్‌. తాజాగా హైదరాబాద్‌లోని గండిపేట జలశాయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఈపార్క్‌లో యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. గండిపేట పార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌కు హెచ్‌ఎండీఏ బృందానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అందమైన హైదరాబాద్‌ నగరానికి ఈపార్క్‌ మరింత శోభను సంతరించుకొందన్నారు.

పర్యటక రంగంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. గండిపేట్‌ పార్క్‌ను5.50ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ.35.60కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసినట్టు హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. సెంట్రల్‌ పెవిలియన్‌ టికెటింగ్‌ కౌంటర్‌లు, ఎంట్రెన్స్‌ ప్లాజా, వాక్‌వేస్‌, ఆర్ట్‌ పెవిలియన్‌, ప్లవర్‌ టెర్రస్‌, పిక్‌నిక్‌ స్పేసెస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఇన్నర్‌ యాక్సెస్‌ రోడ్డు, కిడ్స్‌ ప్లే, ఏరియా ఫుడ్‌ కోర్టులు ఇంకా మరెన్నో సదుపాయాలు ఈ గండిపేట పార్క్‌లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చూపరులను ఇట్టే అకట్టుకునేవిధంగా లైటింగ్‌తో అలంకరించామన్నారు. త్వరలో ప్రజావసరాలమేరకు దీనిని ప్రారంభిస్తామని తెలిపారు.

 

- Advertisement -