తెలంగాణ కల నెరవేర్చాం: కేటీఆర్

6
- Advertisement -

తెలంగాణ అనేది ఒకప్పుడు కల…కానీ దానిని నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్,కేసీఆర్‌ది అన్నారు కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…అమెరికాలో ఉన్న తెలంగాణ ప్రజలకు మీరు దూరంగా లేరు అని ఎన్నారైలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మన ఘళం వినిపించాం… భవిష్యత్ దూరంగా అనిపించినప్పుడు, మనం దిశగా నడిచాము అన్నారు. స్వయంపాలన నుండి ఆత్మగౌరవం, ఆత్మనిర్బరత వరకు మనం తదుపరి అధ్యాయాన్ని రాస్తున్నాం అన్నారు.

ప్రతి సాగునీటి ప్రాజెక్టు, ప్రతి ఐటీ హబ్, ప్రతి కొత్త పాఠశాల – ఇవేవీ గణాంకాలు మాత్రమే కావు. ఇవి కల నిజం అవుతున్న అంకితహస్తాక్షరాలు. ఇందులో మీ అందరి భాగస్వామ్యం ఉంది – మనమంతా కలిసి సాధించాం అని తెలిపారు.

 

Also Read:ఓటీటీలో ‘చౌర్య పాఠం’..

- Advertisement -