KTR:బీజేపీకి ఎందుకు ఓటేయాలి?

21
- Advertisement -

గత ఎన్నికల్లో గెలిపించినప్పటికి.. ఒక్కరోజు కూడా లోక్‌సభలో మల్కాజిగిరి సమస్యల గురించి ప్రస్తావించని కాంగ్రెస్ పార్టీకి మద్దతియ్యలా..? మల్కాజ్‌గిరి ప్రజలు ఆలోచించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి.. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకు ఎంపీగా అవకాశమిచ్చిన బీఆర్ఎస్ పార్టీని బలపరచాలన్నాకు కేటీఆర్.

రాగిడి ల‌క్ష్మారెడ్డిని ఈ ఎన్నిక‌ల్లో గెలిపిస్తేనే మ‌ల్కాజ్‌గిరికి బ‌లం చేకూరుతుంద‌ని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్.. రాగిడి ల‌క్ష్మారెడ్డి చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి, సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రస్తావించారు. పార్ల‌మెంట్‌లో రాగిడి ల‌క్ష్మారెడ్డి గ‌ళం.. మ‌ల్కాజ్‌గిరికి బ‌లం చేకూరుస్తుంద‌ని వెల్లడించారు.

మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్య‌క్తి రాగిడి లక్ష్మారెడ్డి. తన తల్లి పేరు మీద మధుర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 50 వేల మందికి పైగా సేవలందించారన్నారు. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ మల్కాజ్‌గిరికి చేసిందేమీ లేదు.. చేసేదేమి లేదు అని దుయ్యబట్టారు.

Also Read:గం..గం..గణేశా..సెకండ్ సింగిల్

- Advertisement -