సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు.
సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాని తెలిసి నేను షాక్ అయ్యాను అన్నారు మాజీ సీఎం జగన్. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy
— KTR (@KTRBRS) April 8, 2025
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.
Also Read:జీఎస్టీ వృద్ధి 0 శాతమా?: హరీష్ రావు

