రేవంత్ సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఉడకని అన్నం, నీళ్ల సాంబార్ తో అన్నం పెడుతున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు కేటీఆర్. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం, చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నంతో నీళ్లలాంటి సాంబార్ పెడుతున్నారని, ఆ తిండి మేము తినలేం అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తల్లితండ్రులు.
రేవంత్ సొంత నియోజవర్గ పరిస్థితి ఇలా ఘోరంగా ఉంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరి దారుణం అని ఎద్దేవా చేశారు. కనీసం నీ నియోజవర్గంలో అయినా పిల్లలకి సరైన తిండి పెట్టు మేస్త్రీ అని చురకలు అంటించారు.
రేవంత్ సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఉడకని అన్నం, నీళ్ల సాంబార్!
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం, చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నంతో నీళ్లలాంటి సాంబార్ పెడుతున్నారని, ఆ తిండి మేము తినలేం అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ… pic.twitter.com/HAmiccPs5L
— BRS Party (@BRSparty) February 6, 2025
Also Read:తెలంగాణకు 4 టీఎంసీల నీటి విడుదల

