వినాయక చవితి…మరికొద్ది రోజుల్లో రానుంది. ఎప్పటిలాగే మట్టి గణనాథులను ప్రతిష్టించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువుల్లోని నీరు కలుషితం అవుతుందనీ పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారం దిశగా కొత్త విధానానికి నాంది పలకాలని సూచిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
గుజరాత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దశ మాతా ఉత్సవం ఇటీవలే ముగిసింది. దశ మాతా విగ్రహాల నిమజ్జనాన్ని అహ్మదాబాద్‌లో సరికొత్తగా నిర్వహించారు. స్వచ్ఛ సబర్మతి ఉద్యమంలో భాగంగా వేల సంఖ్యలో దశ మాతా విగ్రహాలను నదిలో నిమజ్జనం చేయకుండా ఒడ్డునే వదిలేసి వెళ్లారు.
ఆ విగ్రహాలను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ నగర మేయర్ విజయ్ నెహ్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, కేటీఆర్‌కి తెలిపారు.దీంతో స్పందించిన కేటీఆర్ గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇలాంటి ప్రయత్నం మనం కూడా చేయలేమా అంటూ ప్రశ్నించారు.
If Ahmedabad can do it, why can’t we in Hyderabad take a leaf from their book and try the same for Ganesh Chaturthi?
What say @bonthurammohan @CommissionrGHMC and all Hyderabadis?? https://t.co/OjWR081vgG
— KTR (@KTRTRS) August 12, 2019