రాష్ట్రంలో కరెంట్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసనలు చూసి యుగాలు అయిందని… ఇది మార్పు మహత్యం అని విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి కరెంట్ కోతలు ఉన్నాయి. కరెంట్ కోతల కారణంగా వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ నిన్న సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు రైతులు. ఈ ఫోటోను ట్వీట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు కేటీఆర్.
కరెంట్ రావట్లేదని సబ్ స్టేషన్‌కు తాళం వేసి ధర్నాకు దిగిన రైతులు
నాగర్ కర్నూల్ – తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో కొన్ని రోజులుగా గ్రామానికి, వ్యవసాయానికి కరెంటు సరిగా రావడం లేదని సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా pic.twitter.com/JqP8C9KOuJ
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2024
Also Read:డెడ్ పుల్ & వాల్వరిన్.. ఫైనల్ ట్రైలర్