రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని బీఆర్ఎస్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు కేటీఆర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల హాస్టల్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కేటీఆర్… ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలి. పాఠశాలల్లో వసతులు, సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1000కు పైగా గురుకులాల్లో ప్రాణనష్టం జరగకుండా.. ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు డిప్యూటీ సీఎం, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
Glad we have been able to push the Congress Govt out of its deep slumber that all is well in Gurukul hostels
Hope the Deputy CM & Govt will take all necessary steps to prevent loss of life and improve quality of food being served across 1000 plus Gurukuls established by KCR… https://t.co/w334cFibkN
— KTR (@KTRBRS) August 13, 2024
Also Read:టీబీజేపీ అధ్యక్ష రేసు..ఈటలకు పొగబెడుతున్న బండి?