మాజీ రాష్ట్రపతి,భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు. కలాం 88వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా శనివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు.పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాంకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ పెసిడెంట్,మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ నివాళులర్పించారు. స్ఫూర్తిప్రదాతగా అబ్దుల్ కలాం ఎన్నటికీ నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
2015లో షిల్లాంగ్‌లోని ఐఐఎంలో నిర్వహించిన ఓ సెమినార్‌లో ప్రసంగిస్తూ కలాం కుప్పకూలి పోయారు. అనంతరం బెథాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం ఆయన పూర్తి పేరు. కలాం తమిళనాడులోని రామేశ్వరంలో గల పేద ముస్లీం కుటుంబంలో 15 అక్టోబర్, 1931న జన్మించారు.
కలాం ఆయన ఎనిమిది సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్లు వేడయం ద్వారా తన మొదటి సంపాదనను ఆర్జించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కలాం పిజిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతర కలాంలో డీఆర్‌డీవో, ఇస్రోలో చేరి ఇండియా మిసైల్ మ్యాన్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. కార్నిజియా మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌తో పాటుగా 48 యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్‌లు కలాంను వరించాయి.
Tributes to the People's President Dr. #APJAbdulKalam on his Birth Anniversary. The nation cherishes this visionary leader who made innumerable contributions to the defence and technology fields pic.twitter.com/QTLsBQ0LTa
— KTR (@KTRTRS) October 15, 2019