ఈ నెల 15 లేదా 16న మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ అర్బన్ కలక్టరేట్ లో వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్,అరురి రమేష్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ ప్రకాష్ రావు, కూడ చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో అనేక పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని…కరోనా వలన పనులు ఆగిపోయాయని చెప్పారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చెప్పామన్నారు.
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం…. భద్రకాళి బండ్ ప్రారంభం,మాస్టర్ ప్లాన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. తాగునీటి సమస్య ఉంది. దాని పరిష్కారానికి కృషి చేయలని చెప్పామన్నారు ఎర్రబెల్లి.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన పనుల పై సమీక్ష చేశామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ మహా నగరంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తాం…మిషన్ భగీరథ తో రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని రిపేర్ చేస్తాం అన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటలో ప్రారంభోత్సవాలతో పాటు నగర అభివృద్ధి పై సమీక్ష ఉంటుందన్నారు.