- Advertisement -
యూకే పర్యటనకు బయలుదేరారు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంగ్లండ్ లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్‌లో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.
Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్
- Advertisement -

