న్యూఎకానమీ ఫోరం వ్యవస్థాపక ప్రతినిధిగా కేటీఆర్‌

199
ktr
- Advertisement -

ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై చర్చించేందుకు కొత్తగా ఏర్పాటైన బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సదస్సు ప్రారంభించడానికి వ్యవస్థాపక ప్రతినిధిగా రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. సింగపూర్‌లో నవంబర్‌ 6,7 తేదీల్లో జరగే ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు.

వివిధదేశాల నుంచి సుమారు 300 కంపెనీల ముఖ్యకార్యనిర్వాహక అధికారులు, రాజకీయ నాయకులు, వక్తలు హాజరయ్యే ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధికి గురించి కేటీఆర్ వివరించనున్నారు. న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆహ్వానం అందడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగేండ్లుగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఆర్థిక ప్రగతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు.

వివిధ దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్లపై చర్చించి అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు అవసరమైన పరిష్కారాలను ఈ ఫోరం సూచించనుంది.

- Advertisement -