నేటి నుండి తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోపట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ZP గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభించాక కేటీఆర్… కొన్ని అభివృద్ధి పనులను చేపడతారు. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఇందులో పాలుపంచుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం అనేవి ప్రధానమైన అంశాలు. ఇదివరకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తెచ్చింది. అది విజయవంతమైంది. ఇప్పుడు దీన్ని విజయవంతం చెయ్యాలన్నది ప్రభుత్వ ముందుకు వెళ్లుతోంది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తిచేయిస్తారు. వార్డుల వారీగా ప్రణాళిక తయారుచేసి, పనులు పూర్తి చేస్తారు.