నేడు వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ..

206
KTR
- Advertisement -

జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసివచ్చే విషయంపై వైఎస్సార్‌సీపీతో చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎంపీ వినోద్‌,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు.

KTR

సీఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే యూపీఏ కూటమితో తెదేపా అధినేత చంద్రబాబు జట్టుకట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఎదురుగాలి వీస్తుండటంతో జగన్‌ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్‌ ఒక్కటే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో జగన్‌తో పలు కీలక అంశాలపై కేటీఆర్ బృందం చర్చించనుంది.

- Advertisement -