చిన్నారి ప్రాణం కాపాడిన కేటీఆర్‌..

790
mla ktr
- Advertisement -

పెద్దలు,పిల్లలు అని తేడా లేకుండా ఆపదలో ఉన్నవారందినీ ఆధరించే మంచి మనసున్న మారాజు మన కేటీఆర్‌. ఆపదలో ఉన్నవారిని ఎల్లప్పుడు ఆదుకునే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఓ బాలుడి గుండె ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.లక్షకు ఎల్‌వోసీ ఇప్పించి ప్రాణదాతగా నిలిచారు.

ktr

వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా, జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామ శివారు కొర్రతండాకు చెందిన కొర్ర శంకర్‌నాయక్, లలిత దంపతులకు నాలుగు నెలల కిందట కుమారుడు పృథ్వీరాజ్ చౌహాన్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో చాలా ఆసుత్రులకు తీసుకెళ్లారు. చివరకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆ బాలుడి గుండెకు రంధ్రం ఉన్నదని.. ఆపరేషన్ కోసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఆ నిరుపేద కుటుంబం అష్టకష్టాలు పడి 2 లక్షలవరకు అప్పు తీసుకొచ్చారు. ఎవరిని అడిగిన మిగిలిన లక్ష రూపాయలు ఎక్కడా పుట్టలేదు. దీంతో ట్విట్టర్‌లో కేటీఆర్‌కు తమ పరిస్థితిని విన్నవించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. సీఎం రిలీఫ్‌ ఫండ్ నుంచి రూ.లక్ష రూపాయలు ఇప్పించారు. ఇటీవలే బాలుడి గుండెకు వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. గురువారం బాలుడిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. చిన్నారి తల్లిదండ్రులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -