BRS: స్టాలిన్ సమావేశానికి కేటీఆర్?

3
- Advertisement -

జనాభా ప్రాతిపదికన దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కేంద్రంపై జంగ్ సైరన్ పూరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 22న(రేపు) దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి రావాల్సిందిగా కేటీఆర్‌ను స్వయంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు వచ్చి ఆహ్వానించారు డీఎంకే నేతలు.

ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 7.30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి చెన్నైకి వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, నిరంజన్ రెడ్డి,జగదీష్ రెడ్డి,శంబీపూర్ రాజు,గాయత్రీ రవి,సురేష్ రెడ్డి,
పార్థసారధి రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.  స్టాలిన్ తో సమావేశం ముగిసిన అనంతరం మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నారు కేటీఆర్.

దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై స్టాలిన్ లేవనెత్తిన అంశం సరైందని కేటీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి కృషిని విస్మరిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. జనాభా పెరుగుదల నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ప్రభుత్వ విధానాలను కచ్చితంగా అమలు చేశాయని ఇప్పుడు అదే కారణంగా వాటిని అసమానత్వానికి గురిచేయడం తగదని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితిలో జనాభా ప్రాతిపదికన మళ్లీ పార్లమెంటు స్థానాలను పునర్విభజిస్తే, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించి, దక్షిణాది రాష్ట్రాలు రాజ్యాధికారంలో వెనుకబడతాయని హెచ్చరించారు. ఇది ప్రాంతాల మధ్య అసమానతలకు దారితీస్తుందని… సమాజ అభివృద్ధిని ముందుంచే విధంగా పునర్విభజన జరగాలని, కేవలం జనాభాను ఆధారంగా చేసుకుని పునర్వ్యవస్థీకరణ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

Also Read:పదో తరగతి పరీక్షలు..కేటీఆర్ కీలక సూచన

- Advertisement -