థ్యాంక్స్‌ ఉపాసన..కేటీఆర్ ట్వీట్

288
ktr upasana
- Advertisement -

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ డెస్క్ కు మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన సమన్వయకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ స్టాల్ రిసెప్షన్ లో కూర్చుని తాను దిగిన ఫోటోను ట్వీట్ చేస్తూ, “కేటీఆర్ సర్… నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది” అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉపాసన ట్వీట్‌కు సందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు అంటూ ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు వివరించారు ఉపాసన. ప్రపంచంలోనే నివసించేందుకు అత్యుత్తమ స్థలాల్లో మూడవది, స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో హైదరాబాద్, తెలంగాణ ముందున్నాయని పేర్కొన్నారు ఉపాసన.

- Advertisement -