బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్.
ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. ORR Exit No 11 (పెద్ద అంబర్ పేట్) వద్ద దిగుతారు. సంఘం హోటల్ వద్ద ఇబ్రహీంపట్నం యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతారు.
ఆ తర్వాత కొత్తగూడ X రోడ్డు ,చౌటుప్పల్ టౌన్ ,నార్కెట్ పల్లి ,నకిరేకల్ వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఉదయం 11 గంటలకు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయడానికి.. సూర్యాపేట జిల్లా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
సాయంత్రం 6:30 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు హాజరవుతారు.
Also Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్