విజ‌య్ దేవ‌ర‌కొండకు షాక్ ఇచ్చిన కేటీఆర్..

209
KTR-Vijay Deverakonda
- Advertisement -

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు సినిమా స్టార్ల‌కు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా య‌క్టివ్ గా ఉండే మంత్రి ఎవ‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అప్పుడే ప‌రిష్కారం చూపుతారు. మంత్రి కేటీఆర్ చేస్తోన్న సేవ‌లు చూసి సెల‌బ్రెటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈమ‌ధ్య హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మంత్రి కేటీఆర్ గురించి త‌న ట్వీట్ట‌ర్ల్ లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం స‌ర‌దాగా హీరో విజయ్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్.

vijay devarakonda, ktr

ఈమ‌ధ్య త‌నకు వ‌చ్చిన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ట్వీట్ స్పందించి న కేటీఆర్ విజ‌య్ కు అభినంద‌నలు తెలిపారు. ఈసంద‌ర్భంగా విజ‌య్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ త‌న ఆనందాన్ని ట్వీట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు.

‘మీకు ఇష్టమైన నాయకుడు మీ ఇంటికి లంచ్ చేయడానికి వస్తే ఎలా ఉంటుంది? ఒక్క సెకను… అసలేం జరుగుతోంది బాసూ. బేసికల్ గా ఏమైనా జరగొచ్చు. మనకు ఇష్టమైన దాన్ని చేసుకుంటూ పోవాల్సిందే అంటూ విజయ్ ట్వీట్ చేశారు. నాకు వ‌చ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును మంత్రి కేటీఆర్ గారికి చూపించాన‌ని చెప్పారు. ఈసంద‌ర్భంగా ప‌లు విష‌యాలు చ‌ర్చించుకున్నామ‌ని తెలిపారు. అవార్డు వేలం గురించి మాట్లాడామ‌ని తెలిపారు. అలాగే హైద‌రాబాద్ లో ఉన్న ప‌లు స‌మ‌స్య‌ల గురించి చరిత్ర గురించి మాట్లాడామ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.

- Advertisement -