KTR:వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు

3
- Advertisement -

అశోక్ నగర్ లో పిల్లలు ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియాలో చూస్తున్నాం… మెయిన్ మీడియాలో చూపిస్తలేరు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి అశోక్ నగర్ లో గతేడాది విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరో రెండు నెలలు గడిస్తే ఏడాది అవుతుందని గుర్తు చేశారు.

ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఆనాడు రెండు పంటలకు కాదు, మూడు పంటలకు రైతుబంధు వేయాలని, నేను వస్తే రూ. 15 వేలు రైతుబంధు ఇస్తా అని రేవంత్ అన్నాడు…ఇప్పుడు వానాకాలం రైతుబంధు కూడా ఇవ్వలేక ఎగ్గొట్టారు అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక బతుకమ్మ పండుగ బతుకమ్మ లెక్క లేదు, దసరా పండుగ దసరా లెక్క లేదు అన్న కేటీఆర్..ఎందుకిలా అయిందో రైతులంతా ఆలోచన చేయాలన్నారు.

Also Read:గ్రూప్‌ 1 పరీక్షపై ప్రభుత్వ ప్రకటన

- Advertisement -