- Advertisement -
కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని సూచించారు కేటీఆర్.
కేంద్రం, బీజేపీ వైఖరిని, దుష్ర్పచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని….ఇక అచ్చే దిన్ దివాస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోల్చుతూ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు.
అలాగే కేంద్రం ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250 పెంచడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. ఇది ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
- Advertisement -