ఢిల్లీలో పీవీ మెమోరియల్‌: కేటీఆర్

0
- Advertisement -

మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కూడా ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ శాసనసభ ద్వారా తీర్మానం పెడితే మన గౌరవం, మన శాసనసభ గౌరవం పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాసనసభలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కి సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దివంగత డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ కి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ, మన్మోహన్‌ సింగ్‌ కి భారతరత్నకి ఇవ్వాలనే ప్రతిపాదనకి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నారు.

డిసెంబర్ 18, 2004లో ఓబీసీల సమస్యల పైన కేసీఆర్ గారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని కేవలం ఐదు నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కొరితే, 45 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చి సమస్య తీవ్రత తెలుసుకుని దాదాపు గంటన్నర పాటు గడిపి అన్ని అంశాలను తెలుసుకున్నారు అన్నారు.

కేసీఆర్ గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపుల్లో వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ తన షిప్పింగ్ పోర్ట్‌ఫోలియోను డీఎంకే పార్టీకి వదులుకొని తీర్చారు అన్నారు. స్వయంగా మన్మోహన్ దగ్గరికి వెళ్లి కేసీఆర్ గారు తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ స్వయంగా షిప్పింగ్ శాఖ డీఎంకేకు ఇవ్వాలని కోరినప్పుడు, ఈరోజు తెలంగాణ కోసం ఇచ్చిన ఈ పోర్ట్‌ఫోలియో.. తెలంగాణ కోసం మిమ్మల్ని ఒక కర్మయోగిగా మారుస్తుందని ఆరోజు మన్మోహన్ సింగ్ కేసీఆర్ గురించి అన్నారు.

Also Read:TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

- Advertisement -