టీ ప్రైడ్‌తో ఉద్యోగ అవకాశాలు

288
ktr speech on ambedkar Jayanthi
- Advertisement -

సమసమాజం కోసం అంబేద్కర్ కలలు కన్నారని ఆ కలలను నిజం చేసేవిధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.. హైదరాబాద్ మాదాపూర్ లోని నాక్ ఎస్సీ,ఎస్టీ కాంట్రాక్టర్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అంబేద్కర్ అంటే కేవలం దళితులకే నాయకుడని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మనిషిని మనిషిగా చూసే కులరహిత సమాజం రావాలని..అది త్వరలోనే వస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మన్ననలు పొందుతోందన్నారు కేటీఆర్. చిన్న రాష్ట్రాలు కావాలని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని .. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల కారకులు ఆయనేనన్నారు.

ఇక మోండా మార్కెట్‌లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్  విద్యార్ధులు, యువత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. చదువుకున్న వారందరికి ఉద్యోగ అవకాశాలుంటాయని వెల్లడించారు.  ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి చట్టం తీసుకోచ్చామని ఈ చట్టం ద్వారా యువతకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. టీ ప్రైడ్ ద్వారా యువతకు శిక్షణ,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు.

స్కాలర్‌ షిప్‌ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు.  అంబేద్కర్ ఓవర్సిస్ స్కీం ద్వారా విద్యార్ధుల చదువుకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. యువత నిరాశ చెందవద్దని రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు.

టీఎస్‌ ఐపాస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.  రైతులకు ఫ్రీగా ఎరువులిస్తానన్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆరేనని తెలిపారు.నల్లగుట్టలో వారం రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని,పద్మారావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -