KTR:కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమికొట్టండి

45
- Advertisement -

కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమికొట్టాలని..నెత్తిన పెట్టుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మడ లక్ష్మీనర్సంహారావును గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొత్తగా మన్నెగూడ మండలం ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో ఒక జూనియర్‌ కాలేజీని స్థాపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా కలికోట సూరమ్మ చెరువును పూర్తిచేస్తామని తెలిపారు.

కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు పైసలిచ్చి ఓట్లడుగుతరు. ఎల్లమ్మ, పోశమ్మల మీద ఒట్లు పెట్టిస్తరు అన్నారు. పొరపాటున గూడా వాళ్లను నమ్మొద్దు… తుల ఉమక్కకు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసిన బీజేపీకి ఈ నియోజకవర్గంలో డిపాజిట్‌ కూడా రానియ్యొద్దని మనవి చేస్తున్నా అన్నారు. నియోజవర్గాన్ని దత్తత తీసుకుని.. అభివృద్ధి సంగతి నేను చూసుకుంట అని హామీ ఇచ్చారు.

మేడిపల్లి, కథలాపురం, బీమారం మండలాలు, కొత్తగా కాబోయే మన్నెగూడ మండలానికి నీళ్లిచ్చే బాధ్యత నాది అన్నారు కేటీఆర్. నేను మాట ఇస్తున్నా. జూనియర్‌ కాలేజీ కావాలె అని లక్ష్మీనర్సింహరావు చెప్పారు. రోడ్లు కావాలె అన్నరు. ఈ చిన్నచిన్న పనులు గాదు. మీరు లక్ష్మినర్సింహారావును గెలిపిస్తే.. నేను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలా అభివృద్ధి చేస్తనని వెల్లడించారు.

Also Read:పిక్ టాక్ : క్రేజీ ఛాన్స్ ల కోసమే, కేజీల లెక్క అందాలు

- Advertisement -