తెలంగాణ వికాస సమితి మూడవ మహాసభలు ఈ రోజు నాంపల్లి లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగాయి.తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ సభాద్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ హాజరైయ్యారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీరా చందోక్, నమస్తే తెలంగాణ దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ వేణుగోపాల స్వామి,రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా.ఆయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిదారెడ్డి, బేవరెజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాదరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి, టి.ఎన్. జి.ఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ వికాస సమితి ఉపాధ్యక్షుడు హెచ్.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు ఎంచుకున్న ఒక చర్చతో తెలంగాణ వికాస సమితి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలే కావచ్చు కానీ ఈ అయిదు సంవత్సరాలలో పరమత సహనం,ఇతరులను గౌరవించే విధానం లాంటి సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగొస్తున్న విషయం తెలంగాణ వికాస సమితి తమ పుస్తకంలో ప్రచురించినందుకు చాలా ఆనందంగా ఉంది.
దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. మాటలకు,కులాలకు అతీతంగా పిలుచుకునే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. ప్రో.జయశంకర్ భాషకు మతం ఉండదు కానీ మతానికి అయితే భాష ఉంటుంది అని ఎప్పుడు అనే వారు.ప్రో.మీరా ఛందోక్ మేడం రాజకీయ నాయకులు ఏం అనుకోవద్దు నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను అని అన్నారు. దానికి నేను చెప్పే ఒకే ఒక్క సమాధానం ఇది ఢిల్లీ కాదు మేడం హైదరాబాద్ మీరూ ఏదైనా ఎలా అయినా మాట్లాడొచ్చు.
తెలంగాణ మహా కవులు సాంస్కృతిక వివిధ భాషలలో కవిత్వాలను రచించారు.చరిత్ర అంటే ప్రతికూల పరిస్థితులకు, అనుకూల పరిస్థితులకు జరిగే యుద్ధమే అని మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వారు.కానీ అందరిని ఒకే తాటిపై తీసుకొచ్చిన వాదన వినిపించింది తెలంగాణ. ఏ నినాదంతో అయితే తెలంగాణ ఏర్పడిందో ప్రాతిపదికన అటు వైపు మళ్ళీ ప్రజలలో వస్తున్న దుష్పఆచారాలను అడ్డుకట్ట వేసే విధంగా తెలంగాణ వికాస సమితి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది.అని కేటీఆర్ అన్నారు.