చల్లా వెంకట్రామిరెడ్డి అన్న మొండోడు.. అనుకున్న పని చేసి చూపించే నాయకుడు అని కేటీఆర్ ప్రశంసించారు. ఆయన ఎప్పుడూ “నా నియోజకవర్గం, నా జిల్లా బాగుండాలి” అనే ఆలోచనతోనే ముందుకు సాగేవాడని తెలిపారు. అధికారంలో ఉన్నంత కాలం తన స్వంత ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి పనిని కూడా అడగలేదని, ఏం అడిగినా “నా అలంపూర్ అభివృద్ధి” గురించే మాట్లాడేవాడని గుర్తుచేశారు.
మా ప్రభుత్వం అధికారంలో లేకపోయిన తర్వాత కూడా చల్లా వెంకట్రామిరెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై అదే పట్టుదలతో నిలబడ్డాడని చెప్పారు. “మా నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పు” అని తనను ఒత్తిడి చేసేవాడని వెల్లడించారు. తాను ఫోన్ చేయగా, “నాకు ఇప్పటికే చేశాడు.. ఇప్పుడు నీతో చేయిస్తున్నాడా?” అని జగన్ స్పందించారని పేర్కొన్నారు. అంతటి కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి చల్లా వెంకట్రామిరెడ్డి అని కేటీఆర్ అన్నారు.
Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!
బీఆర్ఎస్ కౌన్సిలర్లను రెండేళ్లు ఇబ్బంది పెట్టినా, రెండు సంవత్సరాల తర్వాత సినిమాలో హీరో వచ్చినట్లు కేసీఆర్ వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. “ఇంటర్వెల్ దాకా వాళ్లు, ఇంటర్వెల్ తర్వాత మనం” అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన శిథిలాలను చూస్తుంటే గాజాను తలపిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.

