ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్..

179
ktr
- Advertisement -

బీజేపీ సీనియర్ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, వి. శ్రీనివాస్ గౌడ్‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, భానుప్రసాద్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మరియు ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. బీజేపీ- కాంగ్రెస్ కి దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. 28వందల ఎజెండాలు ఉంటాయి. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్ కి పరాజయం తప్పదు అన్నట్లు ప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు. బీజేపీ నేతలందరూ ఆర్భాట ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యం అని ఎద్దేవ చేశారు.

గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు టీఆర్‌ఎస్ చేసింది ఏంటో అక్షర సంఖ్య లెక్కలు చెప్తాం. 2లక్షల 72వేల కోట్లు కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది. కేంద్రం నుంచి తెలంగాణ వచ్చింది 1లక్ష 29వేల కోట్లు మాత్రమే. తెలంగాణ టీఆర్‌ఎస్ ఏం చేసింది అంటే గంటసేపు ఉపన్యాసం ఇస్తాం..ఎన్డీఏ దేశానికి ఏం చేసింది అంటే సప్పుడు చేయరు అని కేటీఆర్‌ విమర్శించారు జీడీపీ లో బంగ్లాదేశ్- శ్రీలంక కంటే వెనుకబడ్డాము. నల్లధనం తెచ్చి ఒక్కో అకౌంట్ లో 15లక్షలు వేస్తా అన్నారు. దేశానికి నల్లధనం తెలీదు కానీ నల్ల చట్టాలు తెచ్చారు అని మంత్రి మండిపడ్డారు.

బీజేపీతో ఏ వర్గం లేదు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మతం పేరుతో చిచ్చుపెట్టాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో స్థానం లేదు. కేవలం రాజకీయం కోసం తెలంగాణ పేరును నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -