KTR:నేను చెప్పింది అబద్దమైతే రాజీనామా చేస్తా?

18
- Advertisement -

2014 లో బడే భాయ్ మోడీ గారు మస్త్ కథలు చెప్పిండు. రూ. 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్ ఒక్కటైన నెరవేరిందా ఆలోచించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సీతాఫల్ మండి , అడ్డగుట్ట డివిజన్ రోడ్డు షోలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్…బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్ లు ఇచ్చిండు. నల్లధనం ఏదయ్యా మోడీ అంటే…తెల్లమొఖం వేసిండు.కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్రమంత్రై ఐదేళ్లు అయ్యింది. పైసా పని చేయలేదు.ఆయన చేసిందల్లా కుర్, కురే ప్యాకెట్లు పంచుడేనన్నారు.

హైదరాబాద్ లో వరదలు వస్తే రూపాయి ఇయ్యలే. మెట్రో కు పైసా ఇయ్యలే…కానీ గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యికోట్లు ఇచ్చిండన్నారు. గుజరాత్ వాళ్లే ప్రజలా ? హైదరాబాద్ వాళ్లు ప్రజలు కాదా? …అడ్డగుట్టకు, సీతా ఫాల్ మండి డివిజన్ , సికింద్రాబాద్ కు ఏం చేసినవో చెప్పి ఓటు అడిగే దమ్ముందా కిషన్ రెడ్డికి అని ప్రశ్నించారు.

సిగ్గు లేకుండా ఐఐటీలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలేదు,ఈ ప్రధాని మోడీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిన పిరమైన ప్రధాని. మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండని మండిపడ్డారు. ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు..మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు అన్నారు. నేను చెప్పింది అబద్దమని కిషన్ రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..ఈసారి సిక్రిందాబాద్ శాసన సభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కావాలె. హైదరాబాద్ లో మీరు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. అందుకు మీకు రుణపడి ఉంటాం అన్నారు.

బడేభాయ్ బడా మోసం. రేవంత్ రెడ్డిది కూడా బడా మోసమే.బస్సు ఫ్రీ, మహిళలకు రూ. 2500, వృద్ధులకు 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నాడు.రేవంత్ రెడ్డి చెప్పి వాటిలో ఒక్కటైనా వచ్చిందా?..కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం. వాళ్ల కాళ్లు మంచివి కావు.కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని తెలిపారు. ఒక్క సికింద్రాబాద్ నుంచే పజ్జన్నకు 60 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.

Also Read:BRS:ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి

- Advertisement -