KTR:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంక్షోభం

4
- Advertisement -

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంక్షోభం నడుస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రియల్టర్స్ ఫోరం మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్..కేసీఆర్ టిఆర్ఎస్ పెట్టే వరకు తెలంగాణ శక్తి ఎవరికి తెలియలేదు అన్నారు. తెలంగాణలో భూమి కేంద్రంగా అనేక పోరాటాలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడితే భూముల రేట్లు పడిపోతాయని ప్రచారం చేశారు…తెలంగాణ వచ్చాక మంచి జరుగుతుందని మేము చెప్తే నమ్మలేదు అన్నారు.

2009 నుండి 2014 వరకు తెలంగాణ కేంద్రంగా చర్చ జరిగిందని…పొట్ట కొట్టేటోళ్లతోనే మా పంచాయతీ అని కేసీఆర్ అన్నారు. 2014 ఎన్నికలకు అదే నినాదంతో ముందుకు వెళ్ళాము…మొదట్లో హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీకి పట్టు దొరకలేదు అన్నారు. పదేళ్ళ కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణలో
ఎకరం భూమి 15 లక్షలు ఉందన్నారు.

తెలంగాణ వచ్చాక సాగు,త్రాగు నీరు వచ్చిందని…రైతు బంధు,రైతు భీమా లాంటి పధకాలు వచ్చాయి అన్నారు. మార్పు…మార్పు అంటూ ఊదరగొట్టారు, పెట్టుబడులు ఏపీకి వెళ్తాయని 2014 లో మమ్మల్ని అన్నారు…తెలంగాణ ఏర్పడ్డాక మనకు కరెంటు లేదు అన్నారు. భూముల ధరలు పెరుగుదల అల్లావుద్దీన్ అద్భుతదీపం కాదు అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది కాబట్టే భూముల ధరలు పెరిగాయి…ఆటో పైలెట్ మోడ్ అయితే కాంగ్రెస్ సంవత్సరం పరిపాలన ఏమైందన్నారు.

నేడు కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు…నల్గొండలో కాంగ్రెస్ మీటింగ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ వున్నప్పుడు వడ్లు త్వరగా కొనేవారని అన్నారు. బిఆర్ఎస్ ఉన్నప్పుడు పర్మిషన్లు త్వరగా వచ్చేవి అన్నారు. ఇప్పుడు పర్మిషన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు…రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంక్షోభం రాబోతుందని ప్రముఖ బిల్డర్ నాతో అన్నారన్నారు.

నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్ అని సీఎం కాకముందు రేవంత్ రెడ్డి అన్నారు, చిన్న వయసులో రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనుకున్నా అన్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అంటున్నారు…హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు…లేక్ వ్యూ అని పెట్టాలంటే బిల్డర్లు భయపడుతున్నారు అన్నారు. బిల్డర్లను బెదిరిస్తున్నారు…ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి పైసలు పంపుతున్నారు అన్నారు. మా మీద కోపంతో ప్రజల కడుపు కొట్టొద్దు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమ్మకాలు రిజిస్ట్రేషన్లు తగ్గాయి…ఎన్నికల్లో నో ఎల్.ఆర్.ఎస్ నో బిఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతలు అన్నారు.

ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ కట్టాలని ప్రభుత్వం అంటోందని…ఎఫ్టిఎల్,బఫర్ జోన్ లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసిందన్నారు. అమీన్ పూర్ లో మూడు రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత హైడ్రా కూలగొట్టిందన్నారు. రియల్టర్ల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాము…ఇళ్లు కూలగొడితే ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలన్నారు. తప్పకుండా మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం…ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బిఆర్ఎస్ గెలుపు పక్కా అన్నారు.

Also Read:రాహుల్ గాంధీ కోసం బిర్యానీతో వెయిటింగ్!

- Advertisement -