తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. స్విట్జర్‌లాండ్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు.
ప్రవాస భారతీయుల సమక్షంలో సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందని.. వారు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, తెలంగాణ సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.
ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు అప్పు, తప్పు అంటున్నారని, భారత దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేనివాళ్లు పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలు అంటూ హేళన చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, హరిత హారంతో రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..